Search This Blog

2025/09/28

ఎందుకు సంధ్యా నీకీక్రోదం

 ఎందుకు సంధ్యా నీకీక్రోదం?

సింధూరమల్లే  కందెనె వదనం

రక్కసులెవరని బయపడుతున్నావ్ ? 

రాజ్యాలేలేనేతలు వీళ్ళు
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ
అడ్డొస్తే  తెగ నరికేస్తారు

అంతంతమాత్రం చేస్తేగాని
అంతో ఇంతో ఆస్తులు రావు
అంతంత ఆస్తులు కావాలంటే
ఇంతేకదవో  నెత్తులుగొట్ట

నదులనుకోకవి రక్తం భాను
పారెను చూడు రాజ్యాయలవెంట

కులాల గొడవలు అపుడేపోయేన్ 
మతాల గొడవలు ఇప్పుడుబోయెన్ 
తప్పదుకదరా వీళ్ళకి పాపం
ఏదో గొడవలు పుట్టిస్తారు
పుట్టినవాళ్ళని  చంపేస్తారు

తెల్లాలెవరూ లేరో ఇక్కడ  
మిగిలిన వీళ్ళు మనవాళ్ళే
నల్లదనంకోసమేమో  తెల్లగుడ్డలేసారు
నల్లధనం దాచమని తెల్లవాళ్ళకిచ్చివీళ్ళు 

నిన్నో-మొన్నో అన్నా...జెప్పే
అంతకు ముందే బాబా ...జెప్పే
ఎందరు చెప్పిన ఏముందోయి
చెప్పినవాళ్ళ  కంపేబోయే
ఏడుందమ్మా కంబళి  అంటే
యేడేసామో ఆడే ఉంది

ఏమీ చూడకు,ఎవరితొననకు

ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు
నిన్నూ నన్నూ ముంచేటోళ్ళు 

మైమరపంటే తెలియదు కాదా 
వీళ్ళని అడిగి  బాగా నేర్వు 
తెల్లారు ఝాముకి  సుద్ధం మరువు
పడమటి కొండలు బాగున్నాయి
పొద్దున్నొద్దువు  పదరా బాబు

                                                                                                                                                              తెలుగు రచన 

వెంకీ-వెంకడు

 పెట్టనీ నేనంటే - కాదని నీవంటే .

పెట్టా లేకుండా పిల్లాలేట్లయ్యా ?   (వెంకి)

నువ్ పట్టుకున్నాక , నే పెట్టుకొంటానంటే ,
అది పట్టకుండా నువ్ అలగాలేదామ్మి .    (వెంకు)

పెట్టనూ  వద్దు.కుక్కనూ వద్దు.
నువ్ పక్కనుంటే చాలు - చక్కనీ మామా !!   ( వెంకి)

                                                                              ... ???
(ఇంతకీ ఏమ్జరిగింది?)

2025/09/24

పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది

పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది

వెలుగు కాస్తా సమసిపోతోంది

వేడి సెగలు వేసవల్లే రగులుతుంటే

అక్కడక్కడ పిడుగుపాటుకు తూట్లు పడుతుంటే

అసురధ్వనిలో ఆర్తనాదం అనిగిపోతుంది

అనగద్రొక్కే ఉక్కుపాదం అడుగులేస్తోంది

అన్నెమెరుగని చిన్న ప్రాణులు చితికిపోతుంటే 

తెగల సెగల మంటలోన 

మానవత్వం మాడిపోతుంది

మనిషినే మరి మనిషి చూసి వణికిపోతుంటే 

కడుపు కోసం కోరలెత్తే క్రూర మృగములు 

కాస్త కూడా కరుగ రాని కొండరాళ్ళు

జాలి పడుతున్నాయ్ సోలిపోతున్నాయ్

కుళ్ళిపోయిన తోటలోని మల్లెపూలే

ఎర్రబడుతున్నాయ్ రగతమవుతున్నాయ్

మతాలేమో తలో దారికి పరుగులెడుతింటే

కులాలేవో కొత్త జెండా లెత్తబోతుంటే

భవితకే చరిత మనము స్మరణకీయాలి

ఎవరికెవరు  ఎవరుగాక

చివరికెవరై మనము బ్రతకాలి

====================

                య. వెంకటరమణ