ఎందుకు సంధ్యా నీకీక్రోదం?
సింధూరమల్లే కందెనె వదనం
రక్కసులెవరని బయపడుతున్నావ్ ?
రాజ్యాలేలేనేతలు వీళ్ళు
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ
అడ్డొస్తే తెగ నరికేస్తారు
అంతంతమాత్రం చేస్తేగాని
అంతంతమాత్రం చేస్తేగాని
అంతో ఇంతో ఆస్తులు రావు
అంతంత ఆస్తులు కావాలంటే
అంతంత ఆస్తులు కావాలంటే
ఇంతేకదవో నెత్తులుగొట్ట
నదులనుకోకవి రక్తం భాను
నదులనుకోకవి రక్తం భాను
పారెను చూడు రాజ్యాయలవెంట
కులాల గొడవలు అపుడేపోయేన్
మతాల గొడవలు ఇప్పుడుబోయెన్
తప్పదుకదరా వీళ్ళకి పాపం
తప్పదుకదరా వీళ్ళకి పాపం
ఏదో గొడవలు పుట్టిస్తారు
పుట్టినవాళ్ళని చంపేస్తారు
తెల్లాలెవరూ లేరో ఇక్కడ
తెల్లాలెవరూ లేరో ఇక్కడ
మిగిలిన వీళ్ళు మనవాళ్ళే
నల్లదనంకోసమేమో తెల్లగుడ్డలేసారు
నల్లదనంకోసమేమో తెల్లగుడ్డలేసారు
నల్లధనం దాచమని తెల్లవాళ్ళకిచ్చివీళ్ళు
నిన్నో-మొన్నో అన్నా...జెప్పే
నిన్నో-మొన్నో అన్నా...జెప్పే
అంతకు ముందే బాబా ...జెప్పే
ఎందరు చెప్పిన ఏముందోయి
ఎందరు చెప్పిన ఏముందోయి
చెప్పినవాళ్ళ కంపేబోయే
ఏడుందమ్మా కంబళి అంటే
ఏడుందమ్మా కంబళి అంటే
యేడేసామో ఆడే ఉంది
ఏమీ చూడకు,ఎవరితొననకు
ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు
ఏమీ చూడకు,ఎవరితొననకు
ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు
నిన్నూ నన్నూ ముంచేటోళ్ళు
మైమరపంటే తెలియదు కాదా
వీళ్ళని అడిగి బాగా నేర్వు
తెల్లారు ఝాముకి సుద్ధం మరువు
పడమటి కొండలు బాగున్నాయి
తెల్లారు ఝాముకి సుద్ధం మరువు
పడమటి కొండలు బాగున్నాయి
పొద్దున్నొద్దువు పదరా బాబు
No comments:
Post a Comment